బి.సి.అభివృద్ధే ద్యేయం …….బుర్రా
రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బి.సి కులాలకు “ఆత్మ గౌరవ భవనాల మంజరి”కొరకు అన్ని కుల సంఘాలతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో ఏర్పాటు చేసిన “బి.సి ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం” సమావేశంలో బి.సీలు మరియు విస్వబ్రహ్మణ విశ్వకర్మ ల తరపున జిల్లా బి.సి నాయకుడు విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ నర్సింహ చారి ఆధ్వర్యంలో పాల్గొని విశ్వకర్మలకు మరియు బి.సి కులాలకు భవనాలు మంజరి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్న ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మరియు ఆలోక్ గార్లను ఘనంగా సన్మానించి బి.సి లకు మరియు విశ్వకర్మ లకు భవనాలు మంజూరు చేయడం చాలా సంతోషమని ప్రతి జిల్లా కేంద్రంలో కూడా భవనాలు మంజూరు చేయాలని కోరాం బుర్రా వెంకటేషము గారు మాట్లాడుతూ బి.సి ల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పధకాలు ప్రవేశ పెట్టింది అని ప్రతి కుళంలో ఒకే సంఘంగా ఏర్పడి ప్రభుత్వ పథకాలు మరియు భవనాలు అందుకొని బి.సి లు ముందుకు పోవటమే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు
ఇట్టి కార్యక్రమంలో అన్ని కుల సంఘ నాయకులతో పాటు యాదాద్రి భువనగిరి నుండి నామోజు రాజు గిరిధార చారి బ్రహ్మచారు కృష్ణచారి అంజయ్య నరేష్ మహేందర్ సురేష్ వినోద్ కుమార్ తో పాటు పాల్గొని హర్షం వెలిబుచ్చారు