రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన..
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి గారి సీడీపీ నిధులు రూ. 10 లక్షలతో పట్టణము లోని స్రిగ్ధా కాలనీలో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ భవనానికి మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ ఛైర్మన్ చింతల కిష్టయ్య లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలు అన్ని వసతులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జిట్టా వేణుగోపాల్ రెడ్డి, ఏవీ కిరణ్, కాలనీ అధ్యక్ష్య, కార్యదర్శులు కె. చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దిడ్డి బాలాజీ, లక్ష్మా రెడ్డి, రఘుపతి, ఆనంతప్ప, వదిచర్ల రాజు, రామచంద్రా రెడ్డి, సోమి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.