రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ సోదరుని ద్వాదశ దినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు నాయకులు
ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారి సోదరుడు (అన్న) స్వర్గీయ పోత్నక్ సుధాకర్ గారి ద్వాదశ దినకర్మ భువనగిరి పట్టణంలోని స్థానిక మాధవరెడ్డి ముస్లిం షాదీ ఖానా హైదరాబాద్ చౌరస్తా లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (డిసిసి) అద్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వలిగొండ ఎం పి పి నూతి రమేష్, చైర్మన్ శ్రీ ఎనబొయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య , మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్స్ కైరం కొండ వెంకటేష్ ,ఈరపాక నరసింహ, పచ్చల జగన్, నల్లమాస వెంకటేష్, కో ఆప్షన్ సభ్యులు రాచమల్ల రమేష్ వివిధ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థల నాయకులు బీసుకుంట్ల సత్యనారాయణ, దర్గాయి హరి ప్రసాద్,ఎండీ బబ్లూ, మటూరి బాలేశ్వర్, ఇటుకల దేవేందర్, ఏనుగు సురేశ్ రెడ్డి రావుల రాజు, బింగీ నరేశ్, దాత్రక్ వెంకటేశ్, బైశెట్టి రవీందర్, తదితరులు పాల్గొని చిత్ర పటానికి నివాళులు అర్పించి సుధాకర్ గారు విద్యార్థి దశ నుంచి ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ పార్టీ కి చేసిన సేవను ,సామాజిక ప్రజాసేవను స్మరించుకోవడం జరిగింది.