• షర్మిలక్క ప్రజా ప్రస్థానం క్యాంపు వద్ద యాక్సిడెంట్
  • అంబులెన్స్ కు ఫోన్ చేసినా స్పందన కరువు
    -పాదయాత్రకు సంబంధించిన అంబులెన్స్ లోనే బాధితులను తరలించిన వైయస్ షర్మిల గారు.

ప్రజాప్రస్థానంలో భాగంగా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు పాదయాత్ర చేపడుతున్నారు. మండలంలోని కృష్ణ రాయపల్లి క్రాస్, మర్రిగూడ గ్రామం వద్ద నైట్ హాల్ట్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం వైయస్ షర్మిల గారి క్యాంప్ కు 100 మీటర్ల దూరంలో యాక్సిడెంట్ జరిగింది. 108 అంబులెన్స్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మానవతా దృక్పథంతో పాదయాత్ర కు సంబంధించిన అంబులెన్స్ లో పార్టీ నాయకులతో కలిసి వైయస్ షర్మిల గారు క్షతగాత్రులను తరలించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ దివంగత మహానేత పేదల కోసం ప్రవేశపెట్టిన 108 సర్వీసులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. 108కు ఫోన్ చేసినా స్పందన కరువైందన్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయని, 108 సేవలను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.